Page Loader
Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..
పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..

Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..

వ్రాసిన వారు Stalin
May 19, 2024
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్లకు క్లచ్ ప్లేట్లు, బ్రేకులు ఎక్కడ ఉంటాయో తెలిసీ తెలియని వయసు అది. బ్రేకులు వేయబోయి క్లచ్ ప్లేట్లపై కాలు పడింది . దీంతో అభం ,శుభం తెలియని స్నేహితులు అకాల మృత్యువు పాలయ్యారు. మహారాష్ట్ర పూణేలో శనివారం సాయంత్రం వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. దీంతో ఆ స్నేహితులు మృతి చెందారు. కారును నగరంలో ప్రముఖ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల యువకుడు నడుపుతున్నాడు. ఈ ఘటన పూణెలోని కోరేగావ్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. కళ్యాణి నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్న స్నేహితుల బృందం మోటార్‌బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు.

Details 

రోడ్డు ప్రమాదాలకు కారణం తల్లి తండ్రులే..

వారు కళ్యాణి నగర్ జంక్షన్ వద్దకు వచ్చినప్పుడు, పోర్ష్ నడుపుతున్న బాలుడు మోటారు సైకిళ్లలో ఒకదానిని ఢీకొట్టాడు, దాని తర్వాత ఇద్దరు రైడర్లు వాహనం నుండి పడిపోయారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. నూనూగు మీసాల వయసులో ఉన్న యువతకు ఖరీదైన కార్లు ఇచ్చి విలువైన ప్రాణాలను తీస్తున్నారు. పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం తల్లి తండ్రులే కారణం అవుతున్నారు.