Doctors Terror Network: దిల్లీ ఉగ్ర కుట్రలో మహిళా డాక్టర్ అరెస్టు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో పాలుపంచుకున్న డాక్టర్ షాహిన్ పై నిఘా వర్గాల పరిశీలనలో జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌లో కీలక సంబంధం ఉందని తేలింది. ఆమె జైషే మహిళా విభాగంలో ముఖ్య బాధ్యతలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు సమయంలో ఆమె నుండి కీలక సమాచారం సేకరించారని పోలీసులు వెల్లడించారు. భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రధాన కేంద్రం ధ్వంసమై, మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించడం వంటి కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ మహిళా విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తూ, డాక్టర్ షాహిన్ కీలక బాధ్యతలు చేపట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించారు.
Details
ముజమ్మిల్‌తో డాక్టర్ షాహిన్‌కు దగ్గర సంబంధాలు
డాక్టర్ షాహిన్ లఖ్‌నవూ, షాహిద్ ప్రాంతంలోని లాల్‌బాగ్ నివాసి. ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌పై ప్రత్యేక ఆపరేషన్‌లో అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్‌తో పాటు ఆమెను కూడా అరెస్టు చేశారు. ముజమ్మిల్‌తో డాక్టర్ షాహిన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కారు కూడా డాక్టర్ షాహిన్ పేరుతో నమోదై ఉండటంతో అధికారులు ఆమెను విచారణ కోసం శ్రీనగర్‌కు తరలించారు. అదే సమయంలో, ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు. సహరన్‌పూర్‌కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీపై ఉగ్రవాద నెట్‌వర్క్‌లో సంబంధాల ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో డాక్టర్ ఆదిల్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.