Loading...
Telangana: కరెంటు సమస్యలపై ఇక సోషల్‌ మీడియాలోనే ఫిర్యాదు.. డిస్కంల కొత్త సేవలు!
కరెంటు సమస్యలపై ఇక సోషల్‌ మీడియాలోనే ఫిర్యాదు.. డిస్కంల కొత్త సేవలు!

Telangana: కరెంటు సమస్యలపై ఇక సోషల్‌ మీడియాలోనే ఫిర్యాదు.. డిస్కంల కొత్త సేవలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇల్లు లేదా కాలనీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనా ఇక గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియా వేదికల ద్వారానే క్షణాల్లో విద్యుత్తు పంపిణీ సంస్థలకు (డిస్కం) ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు. ఇందుకోసం వాట్సప్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు డిస్కంల అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలను వినియోగించుకోవచ్చు. తెలంగాణలో విద్యుత్తు పంపిణీ బాధ్యతలను రెండు డిస్కంలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరంగల్‌ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ డిస్కం (TGNPDCL), దక్షిణ తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ డిస్కం (TGSPDCL) సేవలందిస్తున్నాయి.

వివరాలు 

యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదు

ప్రతి డిస్కంకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ఉంది. ప్లే స్టోర్‌లో సంబంధిత డిస్కం పేరుతో సెర్చ్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఉత్తర తెలంగాణ జిల్లాల వినియోగదారులు TGNPDCL లేదా TGNP పేరుతో ప్లే స్టోర్‌లో వెతికితే అధికారిక యాప్‌ కనిపిస్తుంది.

యాప్‌, పోర్టల్‌లలో ఫిర్యాదులు నమోదు చేసే విధానం, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

ఉత్తర తెలంగాణ డిస్కం వివరాలు

ఉత్తర తెలంగాణ డిస్కం ఫేస్‌బుక్‌లో smedia.tgnpdcl పేరుతో అధికారిక ఖాతాను నిర్వహిస్తోంది.

సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ tgnpdcl.com. విద్యుత్తు సమస్యల కోసం 1912 లేదా 18004250028 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేయవచ్చు.

అలాగే 8712481489 నంబరులో అందుబాటులో ఉన్న ఏఐ చాట్‌బాట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

దక్షిణ తెలంగాణ డిస్కం సేవలు

దక్షిణ తెలంగాణ డిస్కం కూడా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ఎక్స్‌, ఫేస్‌బుక్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

సోషల్‌ మీడియాలో సంస్థ అధికారిక ఖాతా TGSPDCL పేరుతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఎక్స్‌లో నమోదయ్యే ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఖాతాలో వచ్చే ఫిర్యాదులు నేరుగా సంస్థ సీఎండీ దృష్టికి వెళ్తాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు నగర ప్రజలు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇటీవల ఒక్క నెలలోనే ఎక్స్‌ వేదికగా విద్యుత్తు సమస్యలకు సంబంధించిన సుమారు 1.90 లక్షల పోస్టులు వినియోగదారుల నుంచి నమోదైనట్లు సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT