
Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రామ్ తాళ్ళూరి నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక నేత పవన్ కళ్యాణ్ ఈవిషయాన్ని ఒకప్రకటన ద్వారా వెల్లడించారు. ఈసందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.రామ్ తాళ్ళూరి పార్టీ సంస్థాగత అభివృద్ధి,వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వహిస్తారని వెల్లడించారు. "2014లోనే శ్రీరామ్ తాళ్ళూరి పార్టీ కోసం పని చేస్తానని నాకు తెలిపారు.ఆతరువాత నుండి ఆయన అంకితభావంతో,అప్పగించిన ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ కొనసాగుతున్నారు.పార్టీ తెలంగాణ విభాగంలో ఆయన సక్రియంగా పనిచేస్తున్నారు"అని పవన్ చెప్పారు. సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడైన ఆయన సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానిగా ఉన్నారు శ్రీరామ్'కి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పార్టీప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశాం'' అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రామ్ తాళ్లూరికి జనసేన పార్టీలో కీలక పోస్ట్
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ రామ్ తాళ్ళూరి @itsRamTalluri - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/hLBdMr1wOx
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2025