Page Loader
AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

వ్రాసిన వారు Stalin
Jan 22, 2024
07:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ, లో‌క్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం విడుదల చేసింది. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో తుది జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఈసీ పేర్కొంది. అలాగే ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో ఫిజికల్ కాపీను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించింది. అసెంబ్లీల వారీగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురించింది. అలాగే, నియోజకవర్గాల వారీగా ఆన్ లైన్‌లో పీడీఎఫ్ ఫైళ్ళను అప్‌లోడ్ చేసింది. ఏపీలో నకిలీ ఓటర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తుది జాబితాలో రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జాబితా సిద్ధం