Loading...
Thirupparankundram Karthigai Deepam: ఎట్టకేలకు రాతిస్తంభంపై కార్తిక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి!
ఎట్టకేలకు రాతిస్తంభంపై కార్తిక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి!

Thirupparankundram Karthigai Deepam: ఎట్టకేలకు రాతిస్తంభంపై కార్తిక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై ఉన్న దీపథూన్‌ (రాతిస్తంభం)పై ఎట్టకేలకు కార్తిక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు ఈ క్రతువును నిర్వహించారు. మండపంపై ఇప్పటికే వెలుగుతున్న దీపం నుంచి అగ్నిజ్వాలను తీసుకుని రాతిస్తంభంపై జ్యోతిని వెలిగించారు. సీఆర్పీఎఫ్‌ బలగాల భద్రత నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ వైద్యనాథన్, జస్టిస్‌ పార్తిబన్‌, జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పరన్‌కుండ్రం కొండ వద్దకు చేరుకున్నారు. అయితే కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు.

వివరాలు

ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం

కొండపై ఉన్న దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని బఫర్‌ జోన్‌గా ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్టు శిరస్సుకు సరిగ్గా పైన ఉన్న ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద దీప మండపంపై ఏళ్లుగా కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తున్నారు.

అయితే కొండపై ఉన్న సిక్కందర్‌ దర్గా సమీపంలోని పురాతన రాతి స్తంభంపై కూడా దీపం వెలిగించాలనే అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో గత ఏడాది అక్కడే దీపం వెలిగించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే అవి అమలుకు నోచుకోలేదు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

వివరాలు

సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వానికి ఆదేశాలు

ఈ ఏడాది మాత్రమే రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం నవంబర్‌ 20న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కార్తిక పౌర్ణమి రోజున ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగించడం మరో వివాదానికి దారితీసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలనే తమ ఆదేశాలను ఉల్లంఘించిందని మండిపడింది.

ఈ చర్యను కోర్టు ధిక్కరణగా పరిగణించిన సుప్రీంకోర్టు.. శనివారం రాతిస్తంభంపై దీపం తప్పనిసరిగా వెలిగించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం దీపథూన్‌పై కార్తిక దీపాన్ని వెలిగించారు.

ADVERTISEMENT