bomb threats: బాంబు బెదిరింపులకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా
నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం విమానయాన భద్రతా నియమాలను సవరించింది. భారత్‌లో ఎవరైనా నకిలీ బాంబు బెదిరింపులతో విమాన రాకపోకల్ని ప్రభావితం చేస్తే, ఆ దోషులకు కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయంతో కేంద్రం తాజగా ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల భారతదేశంలో అనేక విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు సంబంధించి సమాచారాలు వెలువడినాయి. ఈ విధమైన బెదిరింపుల వల్ల ప్రయాణికులు, విమాన సిబ్బంది, పర్యవేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దారిమళ్లింపులు, సెక్యూరిటీ ప్రొటోకాల్ వంటి చర్యలు విమానయాన సంస్థలకు ఆర్థిక భారం మోపడం వల్ల చాలా ప్రభావితమయ్యాయి.