NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం

    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం

    వ్రాసిన వారు Stalin
    Aug 08, 2023
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ సర్వీసెస్ బిల్లు (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిందిన విషయం తెలిసిందే.

    ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీర్మానం ప్రవేశపెట్టారు.

    అయితే చద్దా ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభ సభ్యులు చేసిన సంతకాలు నకిలీవని బీజేపీ సభ్యులు ఆరోపించారు.

    చద్దా ప్రవేశపెట్టిన తీర్మానంపై సంతకాలు చేసిన ఎంపీలు పేర్లను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చదువుతుండగా, ఓ ఐదుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆ సంతకాలు చేయలేదని, రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని ఆరోపించారు.

    రాజ్యసభ

    రాఘవ్ చద్దాకు ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసులు 

    తమ సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని నర్హాని అమిన్ (బీజేపీ), సుధాన్షు త్రివేది (బీజేపీ), ఫాంగ్నోన్ కొన్యాక్ (బీజేపీ), సస్మిత్ పాత్ర (బిజూ జనతాదళ్),కె. తంబిదురై (ఏఐఏడీఎంకే) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

    ఈ ఐదుగురు రాఘవ్ చద్దాకు ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

    అంతకుముందు అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. దిల్లీ సర్వీస్ బిల్లును సెలక్ట్ కమిటీ పంపాలన్న ప్రతిపాదన పత్రంపై ఎంపీల సంతకాలు ఫోర్జరీ చేశారన్నారు.

    ఎంపీల వాంగ్మూలాన్ని రికార్డు చేసి, దర్యాప్తు చేయాలన్నారు. దీంతో డిప్యూటీ డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ.. ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.

    అవసరమైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదుకు రాజ్యసభ చైర్మన్ సిఫారసు చేయవచ్చని సంబధిత వర్గాలు తెలిపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్యసభ
    దిల్లీ సర్వీసెస్ బిల్లు
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ఎంపీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    దిల్లీ సర్వీసెస్ బిల్లు

    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ
    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు అమిత్ షా
    నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ

    ఎంపీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025