
Fire Accident: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు షాపులు దగ్ధం
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra nagar)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో ఈ ప్రమాదం జరిగింది.
గోదాములో మంటలు ఎగిసి పడటంతో స్థానికులు పరుగులు పెట్టారు. మంటల కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి.
భారీగా అగ్నికీలలు ఎగిసి పడటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కట్టెల గోదాం నుంచి మంటలు సోఫా తయారీ చేసే షాప్‌కు అంటుకున్నాయి.
దీంతో రెండు గోదాంలు పూర్తిగా కాలిపోయాయి. అయీతే ఈ ప్రమాదంలో ప్రామనష్టం జరగలేదు. గోదాములో ఉన్న మూడు టూవీలర్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిప్రమాద దృశ్యాలు
#Hyderabad : రాజేంద్రనగర్ ఎంఎం పహాడీ నివాస ప్రాంతంలోని కట్టెల గోదాంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సమాచారం మేరకు రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. pic.twitter.com/LSGJqFP5Iv
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 27, 2023