LOADING...
Massive Fire Breaks Out in Train: రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగిలు దగ్ధం
రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగిలు దగ్ధం

Massive Fire Breaks Out in Train: రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగిలు దగ్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్ సర్-సహర్సా మార్గంలో నడిచే గరీబ్‌రథ్‌ రైలులో శనివారం పంజాబ్‌లోని 'సర్‌హింద్‌' వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని జాతీయ మీడియా వివరించింది.ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లోకో పైలట్ పొగను గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. రైలు నుంచి తక్షణమే దిగమని ప్రయాణికులకు సూచించాడు. సమాచారం అందుకున్న రైల్వేఅధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలంలో గంట పొడవునా సహాయక చర్యలు చేపట్టిన తర్వాత మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో ఏ ప్రాణనష్టం జరగలేదు.