Fire Accident: అమీర్‌పేట మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 20, 2026
12:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమిర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఓ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లోపల చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ జరగడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.