Page Loader
Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం 
Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం 

వ్రాసిన వారు Stalin
Jan 10, 2024
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోరుట్లలోని సుఫియాన్‌ షా డింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది. తొలుత గుడిగురుజు దగ్గర ఉన్న సుఫియాన్‌ షా కలప మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్షణాల్లో మిల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మిల్లు సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అందుపులోకి తెచ్చారు. అప్పటికే టింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు. కానీ భారీగా ఆస్తినష్టం జరిగినట్లు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డింబర్ డిపోను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్