Loading...
AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల
అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి కీలక ప్రకటన చేసింది. శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ, ప్రాథమిక రాతపరీక్ష, ఇతర ముఖ్యమైన వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా గురువారం ప్రకటన విడుదల చేశారు.

వివరాలు 

ఎనిమిదేళ్ల తర్వాత నోటిఫికేషన్

గతంలో తెదేపా ప్రభుత్వం 2018 నవంబరులో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

తాజాగా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెదేపా నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టులకు ప్రకటన వెలువడింది.

ఈసారి నియామక విధానంలో కొన్ని మార్పులు చేశారు. దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌), రాతపరీక్షలను తప్పనిసరి చేశారు.

వివరాలు 

మారిన ఎంపిక విధానం ఇదే..

గతంలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు శారీరక కొలతల పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు.

అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు.

తాజా నిబంధనల ప్రకారం.. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష (ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌) నిర్వహిస్తారు.

ఇందులో అర్హత సాధించినవారికి దేహదారుఢ్య పరీక్షలు (పీఈటీ) ఉంటాయి.

ADVERTISEMENT

వివరాలు 

పీఈటీలో భాగంగా 1,600 మీటర్ల పరుగు

దేహదారుఢ్య పరీక్షలో భాగంగా అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగును 10 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి.

ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. డ్రైవింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించినవారికి చివరి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

అర్హతలు ఇవే..

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జనన తేదీ: 1996 జులై 2 తర్వాత, 2008 జులై 1 కంటే ముందు జన్మించి ఉండాలి.

వయో సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

విద్యార్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత తప్పనిసరి.

డ్రైవింగ్‌ లైసెన్సు: నోటిఫికేషన్‌ తేదీ నాటికి కనీసం రెండేళ్లపాటు చెల్లుబాటులో ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.

వివరాలు 

పూర్తి వివరాలు ఎక్కడ చూడాలి?

అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్‌, ఇతర సూచనల కోసం పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in ను సందర్శించవచ్చు.

ADVERTISEMENT