
India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది.
తాజాగా జమ్ముకశ్మీర్‌తో పాటు పలు సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
ఈ ఘటనల నేపథ్యంలో ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ - 'ఇది విరమణ ఒప్పందమా?' అని ప్రశ్నించారు.
అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలతోపాటు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది.
Details
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
ఉధంపుర్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ శబ్దాలు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాయి.
పాక్ పంపిన డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు వెంటనే గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం.
పోఖ్రాన్, శ్రీనగర్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి.
ఇదే సమయంలో పరిస్థితులు తిరిగి ఉద్రిక్తత వైపు వెళ్లుతున్న వేళ, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫెరోజ్‌పుర్, అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్, బార్మర్ ప్రాంతాల్లో భద్రతా కారణాల వల్ల పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.
ఇవన్నీ పాక్ చొరబాటు ప్రయత్నాల పట్ల భారత స్పందనలో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒమర్ అబ్దుల్లా ట్వీట్
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025