LOADING...
Railway Tunnel: ఏపీలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం.. ఆ జిల్లాలకు మహర్దశ 

Railway Tunnel: ఏపీలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం.. ఆ జిల్లాలకు మహర్దశ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉంది. సరుకు రవాణా సౌకర్యం కోసం ఓబులవారిపల్లె నుండి కృష్ణపట్నం వరకు 113 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.2,000 కోట్ల వ్యయం జరిగింది. ఈ రైల్వే మార్గంలో భాగంగా చిట్వేలి, రాపూర్ మండలాల పరిధిలోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి ప్రాంతంలో 7.5 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

వివరాలు 

ప్రయాణికుల రైళ్లను కూడా నడపడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం 

ఈ సొరంగం నిర్మాణానికి సుమారు రూ.470 కోట్లు ఖర్చయింది. సొరంగ మార్గం రూపకల్పనలో రహదారులు, చెరువులు, కుంటలు, వంకలు దాటడానికి 15 ప్రధాన వంతెనలు, 120 చిన్న వంతెనలు కూడా నిర్మించాల్సి వచ్చింది. ఈ రైల్వే మార్గాన్ని 2019 సెప్టెంబర్ 1న అప్పటి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దేశానికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో సరుకు రైళ్లతో పాటు, త్వరలోనే ప్రయాణికుల రైళ్లను కూడా నడపడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.