Page Loader
cabinet meeting 2025: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ
కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ

cabinet meeting 2025: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 కొత్త సంవత్సరంలో ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

వివరాలు 

ఉద్యోగావకాశాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

అలాగే, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయబోతోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)తో పాటు కరువు భత్యం పెంచే యోచనలో ఉంది, దీని వల్ల అదనంగా రూ. 9,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను, అలాగే కొత్త సంవత్సరంలో అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద, ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత పొందింది.