LOADING...
Operation Ajay: 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం 
Operation Ajay: 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం

Operation Ajay: 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్ అజయ్' కింద మొదటి చార్టర్ ఫ్లైట్, యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. విమానంలో 211 మంది పెద్దలు, ఒక శిశువు ఉన్నారు. ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన భారతీయులను కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. శనివారం హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన దాడులలో 2,500 మందికి పైగా మరణించారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయెల్ నుండి తిరిగి వచ్చిన ప్రయాణీకులలో ఒకరు భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Details 

యుద్ధం ప్రారంభమైన  ఎయిర్ ఇండియా విమానం నిలిపివేత 

భారతీయులందరూ మిషన్ డేటాబేస్లో నమోదు చేసుకోవడానికి భారత రాయబార కార్యాలయం ప్రారంభించిన డ్రైవ్ తర్వాత ప్రయాణీకులను "ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్" ఆధారంగా ఎంపిక చేశారు. శనివారం(అక్టోబరు 7వతేదీన) యుద్ధం ప్రారంభమైన రోజున ఎయిర్ ఇండియా తన విమానాన్ని నిలిపివేసింది.తిరిగి భారతదేశానికి వచ్చిన వారి విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ఆపరేషన్ అజయ్ ప్రారంభించాక విమానంలో 212 మంది పౌరులు న్యూఢిల్లీకి బయలుదేరారు అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Details 

ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు జైశంకర్ ప్రకటన 

స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులు రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు జైశంకర్ బుధవారం ప్రకటించారు. ఎంబసీ ఇప్పటికే శుక్రవారం రెండవ విమానాన్ని ప్రకటించింది. "ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్" ఆధారంగా బయలుదేరడానికి ఇమెయిల్ రిజిస్ట్రేషన్‌లను పంపింది. బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇజ్రాయెల్ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది లాడ్ నగరానికి ఉత్తరన ఉంది.