ఆపరేషన్ అజయ్‌ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్ నుంచి ఇండియన్స్ తరలింపు
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్‌ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రతరమైంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది ప్రజలు నేలరాలుతున్నారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. పరిస్థితి చేజారుతుండటంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను కేంద్రం ప్రారంభించినట్లు కేంద్ర విదేశాంగమంత్రి డా. జైశంకర్ ప్రకటన చేశారు. భారత పౌరుల కోసం చార్టర్డ్ విమానాల రెడి చేసినట్లు ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 18 వేల మంది భారతీయులు అక్కడ ఉంటున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.