ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా నెతన్యాహుతో జరిగిన సంభాషణ వివరాలను మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని ప్రస్తుత పరిస్థితిని నెతన్యాహు మోదీ వివరించారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ వెంట ఉన్నారని నెతన్యాహుకు చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, భారత్ ఖండిస్తుందని నెతన్యాహుతో మోదీ చెప్పుకొచ్చారు. అలాగే హమాస్ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు. ఈ కష్ట సమయంలో మద్దతుగా నిలుస్తున్నందుకు భారత్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.