LOADING...
Delhi: ఆసియాలో తొలి రికార్డు.. మరణించిన రోగి శరీరంలో రక్తప్రసరణ ప్రారంభం
ఆసియాలో తొలి రికార్డు.. మరణించిన రోగి శరీరంలో రక్తప్రసరణ ప్రారంభం

Delhi: ఆసియాలో తొలి రికార్డు.. మరణించిన రోగి శరీరంలో రక్తప్రసరణ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ వైద్యులు వైద్య చరిత్రలో చరిత్రాత్మక ఘట్టాన్ని సృష్టించారు. ద్వారకలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆమె అవయవాలను దానం చేసేందుకు సౌకర్యం కల్పించారు. ఆసియాలో ఇదే ఘనత సాధించిన మొదటి ఆస్పత్రి మణిపాల్ అని ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా పక్షవాతం బారిన పడిన 55 ఏళ్ల గీతా చావ్లా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, కుటుంబసభ్యులు ఆమెను నవంబర్ 5న మణిపాల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి మరింత దారుణంగా మారడంతో నవంబర్ 6న ఆమె మరణించారు.

Details

అవయవ దానంలో రక్తప్రసరణ విజయవంతం

మృతురాలి కుటుంబం అవయవ దానం కోరడంతో, వైద్యులు నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ (NRP) అనే అరుదైన విధానాన్ని అన్వయించారు. ఈ ప్రక్రియలో ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ (ECMO) ఉపయోగించి మృతురాలి ఉదర అవయవాల్లో రక్తప్రసరణను విజయవంతంగా పునరుద్ధరించారు. తరువాత అవయవాలను సేకరించి, కాలేయం, మూత్రపిండాలను ఇతరులలో విజయవంతంగా అమర్చారు. వైద్యులు చెప్పినట్లయితే, ఈ పద్ధతి ద్వారా బ్రెయిన్ డెడ్‌ ఉన్న వ్యక్తులకే కాకుండా సహజ మరణాల తరువాత కూడా అవయవాలను సేకరించడం సాధ్యమవుతుందని నిరూపించారన్నారు. ఈ చరిత్రాత్మక విజయం, భవిష్యత్తులో అవయవ దానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement