Page Loader
ఐఏఎఫ్‌ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL 
ఐఏఎఫ్‌ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL

ఐఏఎఫ్‌ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) బుధవారం బెంగళూరులో ఐఏఎఫ్‌కు మొదటి లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ట్విన్-సీటర్ ట్రైనర్ వెర్షన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌ సీబీ అనంతకృష్ణన్‌ భారత వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరికి చిన్నపాటి విమాన నమూనాను బహుకరించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్విన్-సీటర్ వేరియంట్ భారత వైమానిక దళం శిక్షణ అవసరాలకు మద్దతు ఇచ్చే అన్ని సామర్థ్యాలను కలిగి ఉందని, ఇది అవసరమైనప్పుడు యుద్ధంలోనూ కీలక పాత్రను పోషిస్తుందని హెచ్‌ఏఎల్‌ తెలిపింది.

హెచ్ఏఎల్

మిగ్-21 స్థానంలో ఎల్ఏసీ తేజస్ విమానం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 18 ట్విన్-సీటర్ తేజస్ విమానాల కోసం హెచ్ఏఎల్‌కు ఆర్డర్ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది విమానాలను ఐఏఎఫ్‌కు డెలివరీ చేసేందుకు హెచ్ఏఎల్ ప్లాన్ చేస్తోంది. 2026-27 నాటికి మిగతా 10 ట్విన్-సీటర్ వేరియంట్ విమానాలను హెచ్ఏఎల్ సరఫరా చేయనుంది. అదే సమయంలో ఎయిర్ ఫోర్స్ నుంచి మరిన్ని ఆర్డర్లు వస్తాయని హెచ్ఏఎల్ భావిస్తోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LAC) తేజస్ అనేది భారత సైన్యం ఉపయోగించే స్వదేశీ సూపర్‌సోనిక్ విమానం. తేజస్ ఒక యుద్ధ-జెట్. దీన్ని మిగ్-21 స్థానంలో తీసుకొస్తున్నారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ అనేది భారతదేశంలో ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద ఆర్అండ్‌డీ ప్రాజెక్ట్.