Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి.. లేదంటే జైలుకే!
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ప్రదర్శించేందుకు ప్రజలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే జాతీయ జెండా పట్ల సరైన అవగాహన లేక కొందరు తెలియకుండానే త్రివర్ణ పతాకాన్ని అవమానించేలా వ్యవహరిస్తుంటారు. జాతీయ జెండాను ఏమాత్రం అగౌరవపరిచినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు. అందుకే జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నియమ, నిబంధనలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. కొందరు తమ మొబైల్ ఫోన్ కవర్‌పై జాతీయ జెండా నమూనాను ముద్రించుకుంటారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 ప్రకారం.. జాతీయ జెండాను గౌరవించే విధంగా మాత్రమే ఉపయోగించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష పడే అవకాశం ఉంటుంది.
వివరాలు
జాతీయ జెండాను నేలకు తాకనివ్వడం నేరం..
ఫోన్ కవర్‌పై జాతీయ జెండా నమూనా ఉండి.. అది రంగు మారినా, మురికిగా మారినా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
అదేవిధంగా జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలకు తాకనివ్వడం కూడా నేరమే.
జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. గతంలో జాతీయ జెండాను ప్రధానంగా రెండు సందర్భాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు.
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు.
అయితే 2002లో నిబంధనల్లో మార్పులు చేశారు. ఆ తర్వాత ప్రజలు ఇతర రోజుల్లో కూడా జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం కల్పించారు.
వివరాలు
జాతీయ జెండా చిరిగిపోతే ఏమౌతుంది?
ఇళ్లలో కూడా జాతీయ జెండాను ఎగురవేయొచ్చు. అయితే ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వారు రాత్రి వేళ జెండాను తీసేయాలి.
చీకటి పడ్డ తర్వాత కూడా జాతీయ జెండాను అలాగే ఉంచడం నిబంధనలకు విరుద్ధంగా పరిగణించబడుతుంది.
అంతేకాదు.. జాతీయ జెండా చిరిగిపోయినా, దెబ్బతిన్నా దానిని సాధారణంగా ఉపయోగించకూడదు.
జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యకైనా బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.