Page Loader
Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల
ప్రకాశం, నాగార్జున సాగర్ వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల

Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2024
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువనుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జలాశయంలో ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి, 2,71,668 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 67,668 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల, సుంకేసుల, హంద్రీ పరివాహక ప్రాంతాల నుంచి 2,16,973 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి చేరుకుంటోంది.

Details

ప్రకాశం బ్యారేజీ 65 గేట్లు ఎత్తి నీటి విడుదల

శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులు, నీటినిల్వ 210.99 టీఎంసీలుగా నమోదైంది. నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు 16 గేట్లను 5 అడుగుల మేర, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,48,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత నీటినిల్వ 310.55 టీఎంసీలకు చేరింది. పులిచింతల ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులు ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 65 గేట్లను ఎత్తి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.