LOADING...
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల
నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్‌ జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతున్న సమయంలో, ఔట్‌ఫ్లో కూడా సమానంగా నిర్వహిస్తున్నారు. వివరాల ప్రకారం సాగర్‌ కుడి కాల్వకు 10,040 క్యూసెక్కులు ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు పవర్‌హౌస్‌ ద్వారా 33,291 క్యూసెక్కులు నీరు విడుదల స్పిల్‌వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 587.30 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుతం 305.68 టీఎంసీలు నీటినిల్వలో ఉన్నాయి.