LOADING...
 Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల

 Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరో రెండు గేట్లు ఎత్తారు. దీంతో ప్రస్తుతం మొత్తం ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు 2,30,876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ఫ్లో 2,29,129 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

Details

నీటి విడుదల వివరాల ప్రకారం

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30,000 క్యూసెక్కులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,784 క్యూసెక్కులు ఐదు గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 1,33,030 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 881.80 అడుగులు వద్ద ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 197.91 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం వద్ద వరద పరిస్థితులు ఇంకా కొనసాగుతుండడంతో అధికారులు గేట్ల నిర్వహణపై అప్రమత్తంగా ఉన్నారు.