తదుపరి వార్తా కథనం

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 10గేట్లు ఎత్తివేత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 24, 2025
09:59 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం జలాశయానికి వరద ఇన్‌ఫ్లో స్థిరంగా వస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,71,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా నమోదైంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,775 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
Details
ప్రస్తుతం నీటి నిల్వ 881.50 అడుగులు
ఇక 10 స్పిల్‌వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,18,060 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 881.50 అడుగుల వద్ద ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 196.11 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.