Loading...
Kadem Project: కడెం జలాశయంలోకి వరద ఉద్ధృతి.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
కడెం జలాశయంలోకి వరద ఉద్ధృతి.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

Kadem Project: కడెం జలాశయంలోకి వరద ఉద్ధృతి.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ వర్షాల ప్రభావంతో నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు జలాశయం నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం అది 693.100 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జలాశయంలోని ఐదు గేట్లను 8 అడుగుల మేర ఎత్తి మొత్తం 38,140 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు అవసరం లేకుండా వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి..

ADVERTISEMENT