Page Loader
Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే సమయంలో హిమాయత్ సాగర్‌లో కూడా ఒక గేటును ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.