LOADING...
APSDMA: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. కృష్ణా పరివాహక ప్రాంతాలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. కృష్ణా పరివాహక ప్రాంతాలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

APSDMA: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. కృష్ణా పరివాహక ప్రాంతాలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. దీనితో నీటి మట్టం 12 అడుగుల పూర్తి స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల పరిమాణం ఎప్పటికప్పుడు మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది.

Details

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బ్యారేజీ ద్వారా వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నందున, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా లంక గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నదిలో ప్రయాణాలు చేయడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టేందుకు నీటిలోకి దిగడం వంటి పనులను పూర్తిగా నివారించాలని సూచించింది. వరద ఉధృతి నేపథ్యంలో ప్రాణహానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్‌డీఎంఏ స్పష్టం చేసింది.