UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో విమానాశ్రయంలో కలకలం రేగింది. విమాన సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొన్ని వాణిజ్య విమానాలు నిలిపివేశారు. ఇంఫాల్‌కు వచ్చే రెండు విమానాలను దారి మళ్లించారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆ గుర్తు తెలియని వస్తువు గుట్టు విప్పేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) రెండు రాఫెల్ యుద్ధ విమానాలను పంపించింది.
మొదట ఎయిర్ బేస్ నుంచి అత్యాధునిక సెన్సార్‌లతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్‌ను అనుమానిత ప్రాంతానికి ఐఏఎఫ్ పంపింది. అయితే అక్కడ ఏమీ కనిలించలేదు.
ఐఎఎఫ్
ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్ యాక్టివేట్
మొదటి విమానం తిరిగి వచ్చిన తర్వాత, మరొక రాఫెల్ యుద్ధ విమానాన్ని ఐఏఎఫ్ పంపింది. రెండో రాఫెల్ జెట్‌కు అనుమానిత వస్తువు కనిపించలేదు.
ఇంఫాల్ విమానాశ్రయం గగనతలంలో యూఎఫ్ఓ ఎగురుతున్న వీడియోలు ఉన్న నేపథ్యంలో దీన్ని కొట్టిపారేయలేమని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు వెల్లడించాయి. ఇంఫాల్ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను తాము యాక్టివేట్ చేసినట్లు ఐఏఎఫ్ ఈస్ట్రన్ కమాండ్ చెప్పింది.
ఇది జరిగిన తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐఏఎఫ్ రాఫెల్ ఫైటర్ జెట్‌లు పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్‌లో మోహరించారు.