Jaya Bachchan: జయా బచ్చన్ కి మద్దతుగా సోనియా గాంధీ వాకౌట్
రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్‌కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మద్దతు నిలిచారు. మరోసారి రాజ్యసభలో పేరు వివాదం దుమారం రేపింది. జయా బచ్చన్ పేరును జయా అమితాబ్ బచ్చన్‌గా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సంబోధించాడు. దీనిపై అమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై దన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'నాకు పాఠాలు చెప్పొద్దు' అని ధీటుగా బదులిచ్చాడు. ఇక ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
ఛైర్మన్ వైఖరికి నిరసనగా వామపక్షాలు వాకౌట్
ఇక ఛైర్మన్ వైఖరికి నిరసిస్తూ వాపక్షాలు వాకౌట్ చేశాయి. తాము పాఠశాల విద్యార్థులం కాదని, మాలో కొందరు సీనియర్ సిటిజెన్లు కూడా ఉన్నారని జయా బచ్చన్ పేర్కొన్నారు. ప్రతిపక్షనేత మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట్లాడిన తీరు బాధించిందని, మైక్ కూడా కట్ చేశారన్నారు. తాను ఐదోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, తనకు తెలియదా ఎలా మాట్లాడాలో, ఇలాంటి ప్రవర్తన తానూ ఎన్నడూ చూడలేదన్నారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉండడం గమనార్హం.