
Kunki Elephants: ముసలమడుగు శిబిరంలోని కుంకీ ఏనుగుల ఆహారమిదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఏనుగులు ఏమి తింటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంత ఎత్తుగా, లావుగా, బలంగా ఉండే ఈ ఏనుగులు ఏమి తింటాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. సరే, వాటి అడవి జీవనాన్ని పక్కన పెడితే - ముసలమడుగులోని ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఉండే ఆరు కుంకీలకు మాత్రం రుచికరమైన ప్రత్యేక మెనూ సిద్ధంగా ఉంటుంది. ఏమేమి ఉంటాయో చూద్దాం.. రోజువారీ ఆహారం పచ్చగడ్డి - 200 కిలోలు,రాగి,మర్రి ఆకులు - 70 కిలోలు,కొబ్బరి, బెల్లం,రాగి సంగటి.. 20 కిలోలు, మొక్కజొన్న,సజ్జలు, అరటి బెరడులు, జొన్నలు, చెరకు వంటి ఆహార పదార్థాలు కూడా ఇస్తారు. వీటిలో ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండేలా చూసుకుంటారు.ఇలాంటి సమతుల ఆహారం వల్లే ఈ ఏనుగులు 70 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవిస్తాయట.
వివరాలు
ఈత కొలనులు, స్వేచ్ఛా విహారం
కుంకీలకు బంధించామనే భావన రాకుండా ఉండేందుకు,ఉదయం సంగటి ముద్దలు పెట్టిన తర్వాత వాటిని మెల్లగా అడవిలోకి తీసుకెళ్లి నడిపిస్తారు. అడవిలో తిరుగుతూ అవి రకరకాల ఆకులను తింటూ సహజమైన కుంటల్లో ఈత కొడతాయి. అలాగే శిబిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈత కొలనుల్లో కూడా సేదతీరుతాయి. ప్రతిరోజూ మావటీలు వాటికి స్నానం చేయించి శుభ్రంగా ఉంచుతారు. మినీ వైద్యశాల: ఏనుగులకు ఎలాంటి జబ్బు రానివ్వకూడదని అక్కడ ప్రత్యేకంగా ఓ చిన్న డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. అందులో అవసరమైన అన్ని మందులు సిద్ధంగా ఉంటాయి. వెటర్నరీ వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ,ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చికిత్స అందిస్తారు. మొత్తం మీద,ముసలమడుగు శిబిరంలో సరైన ఆహారం,సేదతీరే వాతావరణం, వైద్యసేవలు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి.