Hyderabad: హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 14 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన ఆహార పదార్థాలతో వంటకాలు తయారు చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. వంటవాళ్లు గుట్కాలు, పాన్‌మసాలాలు నములుతూ, పొడవైన గోళ్లతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. కిచెన్లు, డైనింగ్ ఏరియాల్లో కనీస పరిశుభ్రత కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ఇలాంటి హోటళ్లలో భోజనం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం శుక్ర, శనివారాల్లో గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
వివరాలు
షాకైన అధికారులు
ప్రత్యేక బృందాలతో మొత్తం 22 ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లను తనిఖీ చేయగా.. అక్కడి పరిస్థితులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
పేరున్న హోటళ్లలోనూ ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత నిబంధనలు అమలు కావడం లేదని గుర్తించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 14 హోటళ్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరో ఎనిమిది హోటళ్లకు పరిశుభ్రత లోపాలు, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు అందించారు.
వివరాలు
షోకాజ్ నోటీసులు అందుకున్న హోటళ్లు ఇవే..
1. తాజ్ ఫలక్‌నుమా (ఇంజన్‌బౌలి)
2. హోటల్ సబ్జీ (చార్మినార్)
3. పిస్తాహౌస్ రెస్టారెంట్ (షాలిబండ)
4. స్వీకార్ హోటల్ (సంతోష్‌నగర్)
5. మండి ఎట్ 36 అరేబియన్ కిచెన్ (చార్మినార్)
6. గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్ (మాసబ్‌ట్యాంక్)
7. ఇంపీరియల్ మల్టీక్యుసిన్ రెస్టారెంట్ (టోలిచౌకి)
8. తైజా బేకరీ (లక్డీకాపూల్)
వివరాలు
544 కిలోల ఆహార పదార్థాల ధ్వంసం
తనిఖీల సందర్భంగా హోటళ్లలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో పాడైన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు.
కుళ్లిపోయిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహారం, గడువు ముగిసిన వస్తువులు కలిపి మొత్తం 544 కిలోల పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ వివరాలను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు.
వివరాలు
లైసెన్సులు సస్పెండ్ అయిన 14 హోటళ్లు ఇవే..
1. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ (టోలీచౌకి)
2. లక్కీ రెస్టారెంట్ (సంతోష్‌నగర్)
3. షౌగౌస్ కేఫ్ (శాలిబండ)
4. హోటల్ నయాబ్ (నయాపూల్)
5. శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా (గుడిమల్కాపూర్)
6. సిద్ధిఖ్ కబాబ్ సెంట్రల్ కిచెన్ (గుడిమల్కాపూర్)
7.అల్సాబా హోటల్ (టోలిచౌకి)
8. మోహఫిల్ రెస్టారెంట్ (దిల్‌సుఖ్‌నగర్)
9. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ (సంతోష్‌నగర్)
10. డైన్‌హిల్ రెస్టారెంట్ (మాసబ్‌ట్యాంక్)
11. సోహైల్ రెస్టారెంట్ (మలక్‌పేట్)
12.హోటల్ అక్షయ టిఫిన్స్ (మలక్‌పేట్)
13.హోటల్ వెంకటేశ్వర (ఎంజేఆర్ రోడ్)
14.ఈజబ్ ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ (రేతిబౌలి)
ప్రముఖ హోటళ్లలోనే ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు బయటపడటంతో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి చర్చ మొదలైంది.