Page Loader
మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు
మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు

మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే నెలలో భారతదేశానికి రానున్నారు. గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. మే 4,5 తేదీల్లో భారతదేశంలోని గోవాలో జరిగే ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సీఎఫ్‌ఎం)కి పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల పాకిస్థాన్ నిబద్ధత తెలుస్తుందని, విదేశాంగ విధాన ప్రాధాన్యతల్లో తాము ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.

పాకిస్థాన్

పుల్వామా దాడి తర్వాత దెబ్బతిన్న ఇరు దేశాల మద్య సంబంధాలు

2014లో నవాజ్ షరీఫ్ తర్వాత ఏ పాకిస్థానీ నాయకుడు కూడా భారత్‌లో పర్యటించలేదు. ఇన్నేళ్ల తర్వాత పర్యటిస్తున్న తొలి నాయకుడు జర్దారీ కావడం గమనార్హం. ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ప్రెసిడెన్సీని కలిగి ఉన్న భారతదేశం, జనవరిలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో సహా ఇతర ఎస్‌సీఓ సభ్యులకు ఆహ్వానాన్ని పంపింది. 2019లో జమ్మకశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి హోదాను రద్దు చేసిన తర్వా ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి.