Page Loader
Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌ను ఇటీవల పోలీసులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని గతంలో ఆరోపణలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఓ రహాస్య ప్రాంతంలో వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలపై వాసుదేవరెడ్డిపై భారీగా అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.

Details

2 నెలలుగా పరారీలో ఉన్న వాసుదేవరెడ్డి?

విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు వాసుదేవ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక జూన్ రెండో వారంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న వాసు ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు కూడా నిర్వహించారు. కేసులు వెంటాడడంతో వాసుదేవరెడ్డి 2 నెలలుగా పైగా పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన అరెస్టుతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వాసుదేవరెడ్డి మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేశారు.