LOADING...
Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజీనామా చేసిన తర్వాత మనోహర్ లాల్ మాట్లాడారు. తనకు పార్టీ ఏ కొత్త బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని స్పష్టం చేశారు. కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత సీఎం సైనీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, తర్వలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ఖట్టర్