LOADING...
Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి

Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

గిద్దలూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు. వయసు సంబంధమైన ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులుగా ఆయన బాధపడుతున్నారు. హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. రామభూపాల్ రెడ్డి 1994లో టీడీపీ తరపున గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్రంలోని అనేక ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో జరపనున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Advertisement