భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడో వివాహం
ప్రముఖ న్యాయవాది,భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే 68 ఏళ్ల వయస్సులో.. త్రినాను మూడో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. అతికొద్ది మంది స్నేహితులు,కుటుంబసభ్యుల సమక్షంలో లండన్‌లో జరిగిన ఈ వివాహానికి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ లలిత్ మోదీ,ఉజ్వల రౌత్ హాజరైనట్లు తెలుస్తోంది.ఈ వివాహానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. మొదటగా హరీశ్ సాల్వే కి మీనాక్షి అనే ఆమెను వివాహంచేసుకున్నారు. ముప్పై ఏళ్ళ అనంతరం అంటే 2020 జూన్‌లో వారు విడాకులు తీసుకున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. అటు తరువాత కొంతకాలానికి కరోలిన్ బ్రసార్డ్‌ను పెళ్లి చేసుకుని ఆమె నుంచి కూడా విడాకులు పొందినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
2015లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్
ప్రస్తుతం సుప్రీం న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీశ్ సాల్వే గూఢచర్యం కింద పాక్‌లో ఉరిశిక్ష పడిన భారత వ్యక్తి కులభూషణ్ జాదవ్ తరఫున ఇంటర్నేషనల్ కోర్ట్ లో వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో జాదవ్ దగ్గర అయన కేవలం ఒక్క రూపాయి ఫీజు తీసుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు దిగ్గజ సంస్థలైన టాటా గ్రూప్,రిలయన్స్ ఇండస్ట్రీస్,ఐటీసీ వంటి కంపెనీలు క్లైంట్స్ గా ఉన్నారు. ఇదే కాకుండా కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం,బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును కూడా వాదించారు. 1999-2002 వరకు భారత సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించిన ఆయన న్యాయవ్యవస్థలో అందించిన సేవలకు గానూ 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.