Amarnath: మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు జైలు శిక్ష ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పు ఇచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్‌లో ఆయన ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలు
రాజకీయ వర్గాల్లో చర్చ
విచారణ పూర్తయిన తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, దిగువ న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటానని అమర్‌నాథ్ తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో రైల్వే జోన్ కోసం చేసిన పోరాటం కారణంగానే ఇప్పుడు విశాఖకు జోన్ మంజూరైందని ఆయన పేర్కొన్నారు.