LOADING...
Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

నకిలీ మద్యం కేసులో వైసీపీ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు చేరుకున్నారు. అనంతరం జోగి రమేశ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావు ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, జోగి రమేశ్‌ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ జరగిందని వెల్లడించాడు. ఆ వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అధికారులు జోగి రమేశ్‌ నివాసంపై దాడి చేసి, ఆయనను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

Details

జనార్ధన్ రెడ్డి వాగ్మూలం ఆధారంగా అరెస్టు

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్ధనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో జనార్ధనరావు, జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారీకి పాల్పడ్డానని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ వాంగ్మూలాన్ని కీలక సాక్ష్యంగా పరిగణించిన సిట్‌ బృందం, దానిపై ఆధారపడి తదుపరి చర్యలు చేపట్టింది.

Details

ఆరోపణలను ఖండించిన జోగి రమేశ్

అయితే, ఈ ఆరోపణలను జోగి రమేశ్‌ పూర్తిగా ఖండించారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఈ వ్యవహారంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మాజీ మంత్రిగా పనిచేసిన కీలక నేత జోగి రమేశ్‌ అరెస్టు కావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం విస్తృత చర్చకు దారితీసింది.