రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి కూడలి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నారాయణరెడ్డి తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగింది. 108 వాహనంలో యర్రగొండపాలెంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో కందుల నారాయణరెడ్డి, డ్రైవర్ మాత్రమే ఉండగా అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు కూడా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో కందుల నారాయణరెడ్డి పాదయాత్ర చేపట్టారు.