LOADING...
Karnataka: విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే
విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

Karnataka: విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిన ఘటనలో, అదే విమానంలో ఉన్న కాన్పూర్‌ మాజీ ఎమ్మెల్యే, వైద్యురాలు డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడారు. ఆమె చేసిన సేవకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసలు వెల్లువెత్తాయి. శనివారం మధ్యాహ్నం ఇండిగో విమానం గోవా నుంచి దిల్లీకి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే మహిళా ప్రయాణికురాలు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కూలిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కాన్పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ వెంటనే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఆమెకు సీపీఆర్‌ నిర్వహించారు.

Details

బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన ఎయిర్ పోర్టు సిబ్బంది

అంజలి చేసిన ఈ తక్షణ చికిత్సతో ప్రయాణికురాలి ప్రాణాలు నిలిచాయి. విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన అనంతరం, ఎయిర్‌పోర్టు సిబ్బంది బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో కూడా డాక్టర్‌ అంజలి ఆమెతోనే ఉండి పూర్తి సహాయం అందించారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'ఎక్స్‌' వేదికగా డాక్టర్‌ అంజలిని ప్రశంసించారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన సంఘటన అని పేర్కొంటూ, పదవి ఉన్నా లేకపోయినా అంజలి వంటి నేతలు నిజమైన ప్రజాసేవకు నిలువెత్తు ఉదాహరణ అని కొనియాడారు. ప్రతిఫలం ఆశించకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారని ఆయన ప్రశంసించారు.

Details

ప్రజా సేవకు పదవి, హోదా అవసరం లేదు

అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ కూడా అంజలిని అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రజాసేవకు పదవి, హోదా అవసరం లేదని, మనసు ఉంటే చాలు అనే సందేశాన్ని ఆమె చర్య చాటి చెప్పిందని పేర్కొంది. ఇక ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement