తదుపరి వార్తా కథనం
Ananta Das: ఒడిశా మాజీ మంత్రి కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 09, 2025
03:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలేశ్వర్ జిల్లా భోగ్రాయి మాజీ మంత్రి అనంత దాస్ (85) ఆదివారం ఉదయం కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
బీజేడీ కీలక నేతలలో ఒకరైన అనంత దాస్ 2004 నుంచి 2019 వరకు శాసనసభకు వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు.
నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో పరిశ్రమలు, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.
అనంత దాస్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.