LOADING...
Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత
దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుముశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Details

8 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన సాయిబాబా

2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీని కారణంగా సాయిబాబా సుమారు 8 సంవత్సరాలు పాటు జైల్లో గడిపారు. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన నాగ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. సాయిబాబా మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా విశేషంగా గుర్తింపు పొందారు.