H.J. Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న అనంతరం ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారి పడినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
వివరాలు
1996లో డీజీపీగా పదోన్నతి
హెచ్‌జే దొర 1943లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన 1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ అధికారి. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన దొర 1996లో డీజీపీగా పదోన్నతి పొందారు. అనంతరం 2002లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. పదవీ విరమణ అనంతరం కూడా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.