తదుపరి వార్తా కథనం
Vijaya Dairy:విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 06, 2025
10:24 am
ఈ వార్తాకథనం ఏంటి
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. సుమారు 27 సంవత్సరాలు విజయ డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జానకిరామయ్య, పాడి రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేశారు. స్వగ్రామం మొవ్వలో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.