Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించింది. అయితే, ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు.
వివరాలు
కార్డియాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స
అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి కార్డియో-న్యూరో సెంటర్‌లో చేర్పించినట్లు సమాచారం.
ప్రస్తుతం కార్డియాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నిమిషాలపాటు ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
కాగా, జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టులో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2025 జులై వరకు ఆ పదవిలో కొనసాగారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మార్నింగ్ వాక్‌లో స్పృహతప్పిన మాజీ ఉపరాష్ట్రపతి
Former Vice President Jagdeep Dhankhar Admitted To AIIMS After Collapsing During Morning Walk#Jagdeepdhankharhttps://t.co/GSmPkTD7tH
— ABP LIVE (@abplive) November 11, 2026