KTR: ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
గత నెల 31న వాదనలు ముగించుకున్న తర్వాత ఇవాళ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఏసీబీ తరపున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఫార్ములా ఈ-రేసు ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు.
Details
నిబంధనలను విరుద్ధంగా చెల్లింపులు
బ్రిటన్ పౌండ్లలో రూ.46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఏజీ పేర్కొన్నారు.
నిందితులైన అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఎలాంటి పిటిషన్లు దాఖలు చేశారా అని కోర్టు ప్రశ్నించగా, ఎవరూ పిటిషన్లు దాఖలు చేయలేదని ఏజీ తెలిపారు.
దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్ రెడ్డి వాదించారు. ఆ శాఖ మంత్రి పర్యవేక్షణలోనే చెల్లింపులు జరిగాయని, కేటీఆర్ రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని ఆమోదించారని చెప్పారు.
కేటీఆర్ పై నిందలున్నాయని కోర్టుకు వెల్లడించారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదించారు.
ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని, నగదు బదిలీలో ఆయన లాభం పొందలేదని తెలిపారు.