Page Loader
గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి  
గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి

గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీ(Gaur City)లో ఆమ్రపాలి బిల్డర్స్ నిర్మాణాన్ని చేపడుతున్న చోట ఈ ఘటన జరిగింది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌లో నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో లిఫ్ట్‌ కూలడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందాగా మరో ఐదుగు రికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ వర్మ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి