Page Loader
భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి 
భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి

భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 9 నెలల చిన్నారితో సహా నలుగురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను ప్రథమ్ సోని (17), రచన (28), గౌరీ సోని (40), రుహి (తొమ్మిది నెలలు)గా గుర్తించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. గాయపడిన వారిని రాధిక (16), ప్రభావతి (70)గా గుర్తించారు. దిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. షహదారా ప్రాంతంలోని ఒక భవనంలో సాయంత్రం 5:23 గంటలకు మంటలు చెలరేగాయన్నారు. వెంటనే ఘటనా స్థలానికి మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లను పంపినట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6:55 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.

దిల్లీ

వైపర్, రబ్బర్, కటింగ్ మిషన్లకు మంటలు అంటుకోవడంతో..

గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు వైపర్, రబ్బర్, కటింగ్ మిషన్లకు అంటుకోవడంతో తీవ్రత ఎక్కవైనట్లు అతుల్ గార్గ్ వెల్లడించారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత.. ఎంఎస్ పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని స్థానికుల సాయంతో బయటకు తీసినిట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మరో ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగ గాయపడిన ఆరుగురిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆరుగురిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లో యజమానులు ఉంటున్నారు. ఇతర అంతస్తులను అద్దెకు ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంటలు ఆర్పిన తర్వాత భవనంలోకి దృశ్యాలు